Jetwani: ముంబై హీరోయిన్ జెత్వానీ కేసు.. పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేసిన హైకోర్టు

AP High Court adjours hearing of police officers anticipatory bail petition in Jetwani case
  • బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన క్రాంతి రాణా, విశాల్ గున్ని, సత్యనారాయణ
  • కౌంటర్లు వేసేందుకు సమయం కావాలన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్
  • ఈ నెల 23కు విచారణను వాయిదా వేసిన కోర్టు
ముంబై హీరోయిన్ జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని, అప్పటి దర్యాప్తు అధికారి సత్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. 

విచారణ సందర్భంగా... తాజాగా ఈ కేసును సీఐడీకి అప్పగించారని, కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని కోర్టును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. 

కేసు డిస్పోజ్ అయ్యేంత వరకు పోలీస్ అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలో తదుపరి విచారణను ఈ నెల 23కు హైకోర్టు వాయిదా వేసింది.
Jetwani
AP High Court

More Telugu News