Telangana Group 1 Exams: తెలంగాణ గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు లైన్ క్లియ‌ర్‌

Telangana High Court Dismisses Petitions Filed on Group 1 Exams
  • ఈ నెల 21 నుంచి య‌థావిధిగా గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు 
  • నోటిఫికేష‌న్ల‌పై ప‌లువురు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను కొట్టివేసిన హైకోర్టు
  • ప్రిలిమ్స్‌లోని 7 ప్ర‌శ్న‌ల‌కు ఫైన‌ల్ 'కీ'లో స‌రైన స‌మాధానాలు లేవంటూ హైకోర్టును ఆశ్ర‌యించిన పిటిషన‌ర్లు  
తెలంగాణలో గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు లైన్ క్లియ‌ర్ అయింది. ఈ నోటిఫికేష‌న్ల‌ను స‌వాల్ చేస్తూ ప‌లువురు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు య‌థావిధిగా జ‌ర‌గ‌నున్నాయి. 

కాగా, ప్రిలిమ్స్‌లోని ఏడు ప్ర‌శ్న‌ల‌కు ఫైన‌ల్ 'కీ'లో స‌రైన స‌మాధానాలు ఇవ్వ‌లేద‌ని పిటిషన‌ర్లు హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. వాటికి మార్కులు క‌లిపి మ‌ళ్లీ మెయిన్స్‌కు ఎంపిక అభ్య‌ర్థుల‌ జాబితాను విడుద‌ల చేయాల‌ని కోరారు. వీటిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం పిటిష‌న్ల‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. 
Telangana Group 1 Exams
TS High Court

More Telugu News