Rape: హైదరాబాద్ లో ఘోరం.. ఐటీ ఉద్యోగినిపై ఆటోలో సామూహిక అత్యాచారం

Woman IT employee raped in auto in Hyderabad
  • ఆర్సీ పురంలో నిన్న అర్ధరాత్రి ఆటో ఎక్కిన బాధితురాలు
  • రాత్రి 2.30 గంటల సమయంలో ఆమెపై ఆటో డ్రైవర్, మరొక యువకుడు అత్యాచారం
  • గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు
హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలో జరిగింది. 

వివరాల్లోకి వెళితే... నిన్న అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలోని ఆర్సీ పురంలో ఐటీ ఉద్యోగిని ఆటో ఎక్కింది. అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఆటో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఆమెపై ఆటో డ్రైవర్ తో పాటు, మరో యువకుడు ఆటోలోనే అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను మసీద్ బండ వద్దే వదిలేసి పోయారు. తనపై జరిగిన అఘాయిత్యంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Rape
Hyderabad
IT Employee

More Telugu News