Revanth Reddy: ఫాక్స్‌కాన్ కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy meets FoxConn delegates
  • కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కార్యాలయానికి వెళ్లిన సీఎం, మంత్రి శ్రీధర్ బాబు
  • సంస్థ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం
  • మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలన్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను... సంస్థ పురోగతి, ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.

ఢిల్లీకి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17న ఢిల్లీకి వెళ్లనున్నారు. 17న ఢిల్లీలో సీడబ్ల్యుసీ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఆయనతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, పార్టీ నేత వంశీచంద్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు.
Revanth Reddy
Foxconn
Telangana
Congress

More Telugu News