Ambati murali krishna: వైసీపీ నేత అంబటి మురళీకృష్ణపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల తీవ్ర స్థాయి ఆరోపణలు

tdp mla Dhulipalla Allegations on ycp leader Ambati murali krishna
  • జూట్ మిల్లును వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ కబ్జా చేశాడంటూ ధూళిపాళ్ల ఆరోపణలు
  • గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేశారన్న ధూళిపాళ్ల 
  • జీ ప్లస్ 5 అపార్ట్‌మెంట్‌కు అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్దంగా 15 అంతస్తులు నిర్మాణం చేశారని ఆరోపణలు  
వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. ఏలూరు జూట్ మిల్లు డైరెక్టర్ గా ఆయనను తీసుకున్న తర్వాత కబ్జా చేశారని ఆరోపించారు. పొన్నూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ..అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వ కాలంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. 
 
గ్రీన్ గ్రేస్ అపార్ట్ మెంట్స్ నిర్మాణానికి గుంటూరు కార్పోరేషన్ అదికారుల నుండి జి ప్లస్ 5 అని అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా 15 అంతస్తులు నిర్మించారని అన్నారు. ఆ భవన నిర్మాణానికి రైల్వే శాఖ అధికారుల నుండి ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతులూ లేవని తెలిపారు. 

30 సంవత్సరాల క్రితం సంగం డెయిరీలో ఏదో జరిగిందని తనపై కేసు నమోదు చేసి జైలుకు పంపారన్నారు. అయినా దీటుగా ఎదుర్కొన్నానని తెలిపారు. అక్రమ కేసులు పెట్టినప్పటికీ రాజకీయంగా కక్ష సాధించాల్సిన అవసరం తనకు లేదని నరేంద్ర పేర్కొన్నారు.
Ambati murali krishna
TDP
MLA Dhulipalla Narendra

More Telugu News