Gautam Adani: 2024లో అత్యధికంగా సంపాదించిన భారతీయుడిగా గౌతమ్ అదానీ.. ఆస్తి ఎంత పెరిగిందంటే?

Gautam Adani has emerged as the highest wealth gainer as per Forbes India Rich List 2024
  • ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో హయెస్ట్ వెల్త్ గెయినర్‌గా అదానీ గ్రూప్ అధినేత
  • 2024లో ఏకంగా 48 బిలియన్ డాలర్లు ఆర్జించిన అదానీ
  • 27.5 బిలియన్ డాలర్లు సంపాదించి రెండో స్థానానికి పరిమితమైన రిల్ అధినేత ముకేశ్ అంబానీ
అదానీ గ్రూపు కంపెనీల అధినేత గౌతమ్ అదానీ ప్రస్తుత ఏడాది 2024లో అత్యధిక సంపాదన పొందిన భారతీయ సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో హయెస్ట్ వెల్త్ గెయినర్స్ జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. 2024లో గౌతమ్ అదానీ సంపద ఏకంగా 48 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4 లక్షల కోట్లు) మేర పెరిగింది. గతేడాది కంటే ఈ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. ఒక సంవత్సరంలో ఒక భారతీయుడు ఆర్జించిన అత్యధిక సంపద కూడా ఇదే కావడం గమనామర్హం. ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఓపీ జిందాల్ గ్రూప్‌ గౌరవ చైర్మన్ సావిత్రి జిందాల్‌ల ఉమ్మడి సంపద పెరుగుదల కంటే ఎక్కువగా గౌతమ్ అదానీ ఆర్జించడం గమనార్హం. దీంతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ సంపద 116 బిలియన్ డాలర్లకు చేరింది. 

ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో ఈ ఏడాది అత్యధిక సంపద పొందిన వ్యక్తుల జాబితాలో అదానీ తర్వాత స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. 2024లో ఆయన సంపద 27.5 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. దీంతో అతడి నికర ఆస్తి విలువ 119.5 బిలియన్ డాలర్లకు చేరింది. గౌతమ్ అదానీతో పోల్చితే 3.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఎక్కువ సంపదను కలిగివున్నారు.

ఇక 2024లో సావిత్రి జిందాల్ 19.7 బిలియన్ డాలర్లు సంపాదించి నికర ఆస్తిలో శివ్ నడార్‌ను అధిగమించారు. సావిత్రి జిందాల్ దేశంలో అత్యంత సంపన్న మహిళగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో హిసార్ నుంచి ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందారు.

ఇక సునీల్ మిట్టల్ సంపద 13.9 బిలియన్ డాలర్లు, దిలీప్ షాంఘ్వి సంపద 13.4 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. ఈ ఏడాది అత్యధిక సంపాదించిన సంపన్నుల జాబితాలో వీరిద్దరూ వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచిచారు.
Gautam Adani
Mukesh Ambani
Forbes India Rich List 2024
Business News

More Telugu News