Tejaswini: డాడీలో ఎవరూ చూడని కోణం ఈ షో ద్వారా చూశారు: తేజస్విని

Tejaswini heaps praises her father Nandamuri Balakrishna
  • త్వరలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో 4వ సీజన్
  • నేడు ట్రైలర్ విడుదల
  • కార్యక్రమానికి హాజరైన బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని
  • అన్ స్టాపబుల్ కార్యక్రమానికి క్రియేటివ్ కన్సల్టెంట్ గా ఉన్న తేజస్విని
అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో నాలుగో సీజన్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హోస్ట్ నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కూడా పాల్గొన్నారు. ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ టాక్ షోకి తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా ఉన్నారు. ఇవాళ జరిగిన కార్యక్రమంలో తేజస్విని ప్రసంగిస్తూ... తన తండ్రి బాలకృష్ణలోని కొత్త కోణాన్ని అన్ స్టాపబుల్ టాక్ షో ఆవిష్కరించిందని తెలిపారు. 

"ఈ షోలో కొత్త పాయింట్ ఏంటంటే... డాడీలో ఎవరూ చూడని కోణాన్ని ఈ షో ద్వారా చూశారు. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం, కష్టాల్లో ఉన్న తోటి వారి కోసం నిలబడడం, సామాజిక సేవకు ముందుండడం... ఇవన్నీ నాన్నగారిలో ఉన్న లక్షణాలు. సినిమాల్లో ఆయన చేయని జానర్ లేదు, ఆయన వేయని గెటప్ లేదు... ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తి. 

ఈసారి నాన్న గారు హిందూపురం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనతో నేను ఎక్కువ సమయం గడుపుతుంటాను కాబట్టి నాకు తెలుసు... ఎప్పుడూ హిందూపురం నియోజకవర్గం గురించే ఆలోచిస్తుంటారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చే రోగులతో... ఇది ఆసుపత్రి కాదమ్మా, దేవాలయం అని నాన్న గారు చెబుతుంటారు. హేట్సాఫ్ డాడీ!" అంటూ తేజస్విని వివరించారు.
Tejaswini
Balakrishna
Unstoppable with NBK
Talk Show
Trailer
Season 4

More Telugu News