జూబ్లీహిల్స్ లో కలకలం... లోటస్ పాండ్ వద్ద అపస్మారక స్ధితిలో యువతి!

A woman found unconciously at Lotus Pond area
  • రోడ్డు పక్కన అర్థనగ్నంగా పడి ఉన్న యువతి
  • పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
  • కనీసం పేరు కూడా చెప్పలేని స్థితిలో యువతి
  • ఆసుపత్రికి తరలించిన పోలీసులు 
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ వద్ద ఓ యువతి అర్ధనగ్నంగా పడి ఉండడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని గమనించిన స్థానికులు జూబ్లీహిల్స్ పోలీసులకు విషయం తెలియజేశారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, 108 వాహనం ద్వారా ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు.

ఆ యువతి తన పేరు కూడా చెప్పలేని స్థితిలో ఉంది. పోలీసులు ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడి, రోడ్డు పక్కన వదిలేసి ఉంటారని భావిస్తున్నారు.
Go Back to Shorts
Unconcious Woman
Lotus Pond
Jubilee Hills
Police
Hyderabad

More Telugu News