Techie: హైదరాబాద్‌లో మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ బలవన్మరణం

Woman techie commits suicide
  • కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • మార్చిలో సుప్రియారెడ్డితో రాఘవేందర్ రెడ్డికి వివాహం
  • పెళ్లైన నెల రోజుల నుంచే భార్యకు వేధింపులు 
హైదరాబాద్‌లో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నందిపేటకు చెందిన సుప్రియరెడ్డికి అదే జిల్లాకు చెందిన దేవరకద్ర మండలం లక్ష్మీపల్లికి చెందిన రాఘవేందర్ రెడ్డితో మార్చిలో వివాహం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్టువేర్ ఉద్యోగులు.

వీరు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నారు. పెళ్లైన నెల రోజుల నుంచే రాఘవేందర్ రెడ్డి భార్యను వేధిస్తున్నాడు. తాను చెప్పినట్లు వినాలని, జీతం తన బ్యాంకులోనే వేయాలని ఆయన వేధించాడు. పుట్టింటి నుంచి భూమి రాయించుకొని రావాలని వేధించాడు. ఇరువురి మధ్య గొడవల నేపథ్యంలో గురువారం రాత్రి ఆమె బలవన్మరణానికి పాల్పడింది.
Techie
Suicide
Telangana

More Telugu News