Thiruvonam Bumper Lottery: మెకానిక్‌కు జాక్‌పాట్‌.. రాత్రికి రాత్రే బ్యాంక్ ఖాతాలోకి రూ. 25కోట్లు!

Karnataka Mechanic who Won Rs 25 cr Kerala Thiruvonam Bumper Lottery
  • తిరువోణం బంపర్ లాటరీలో కర్ణాటక మెకానిక్‌ను వ‌రించిన అదృష్టం
  • అల్తాఫ్ కొనుగోలు చేసిన లాట‌రీ టికెట్‌కు రూ.25కోట్ల‌ జాక్‌పాట్
  • ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో ప్రైజ్‌ మనీ ఇస్తున్న కేరళకు చెందిన తిరువోణం బంపర్‌ లాటరీ
కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్‌కు జాక్‌పాట్ త‌గ‌ల‌డంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. కర్ణాటకకు చెందిన అల్తాఫ్ అనే మెకానిక్ కేరళ తిరువోణం బంపర్ లాటరీలో లక్కీ విన్నర్‌గా నిలిచాడు. దాంతో అత‌డి బ్యాంక్ ఖాతాలోకి రాత్రికి రాత్రే రూ. 25కోట్లు వ‌చ్చి చేరాయి. అత‌డు కొనుగోలు చేసిన లాట‌రీ టికెట్ నంబర్ టీజీ 434222 ఇలా అల్తాఫ్‌కు పాతిక కోట్ల న‌గ‌దు బహుమతిని తెచ్చిపెట్టింది.

తిరువ‌నంత‌పురంలోని గోర్కీ భ‌వ‌న్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల ప్రాంతంలో డ్రా నిర్వ‌హించ‌గా అల్తాఫ్‌ను లాట‌రీ వ‌రించిన‌ట్లు నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. ఈ డ్రా తీసే కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి కేఎన్ బాల‌గోపాల‌న్‌, ఎమ్మెల్యే వీకే ప్రశాంత్, లాట‌రీ డిపార్ట్‌మెంట్ డైరెక్ట‌ర్ అబ్ర‌హం రెన్న్ పాల్గొన్నారు. 

ఇక త‌న‌కు ఈ భారీ జాక్‌పాట్ త‌గ‌ల‌డం ప‌ట్ల అల్తాఫ్ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. గత 15 ఏళ్లుగా తాను లాటరీ టికెట్లు కొంటున్నానని, ఇన్నాళ్లకు తనను అదృష్టం వరించిందని అల్తాఫ్‌ తెలిపాడు. ఈ ప్రైజ్‌ మనీతో త‌న పిల్ల‌ల పెళ్లి ఘ‌నంగా జ‌రిపిస్తాన‌ని అత‌డు చెప్పుకొచ్చాడు. తాను ఈ ల‌క్కీ టికెట్‌ను సుల్తాన్ బాత్‌రే పరిధిలోని ప‌నామార‌మ్‌లో ఉన్న ఎస్‌జే ల‌క్కీ సెంట‌ర్‌లో కొనుగోలు చేసిన‌ట్లు తెలిపాడు.   

ఇదిలాఉంటే.. కేరళకు చెందిన తిరువోణం బంపర్‌ లాటరీ ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో ప్రైజ్‌ మనీ ఇస్తుంది. గ‌తేడాది ఈ బంప‌ర్ లాట‌రీని సంయుక్తంగా న‌లుగురు గెలుచుకున్నారు. త్రిసూర్‌, త‌మిళ‌నాడుకు చెందిన‌ న‌లుగురు వ్య‌క్తులు ఈ లాట‌రీ విజేత‌గా నిలిచారు.
Thiruvonam Bumper Lottery
Mechanic
Karnataka
Kerala

More Telugu News