మూడో టీ20 కోసం హైదరాబాద్ చేరుకున్న టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు
- హైదరాబాద్ (ఉప్పల్) వేదికగా శనివారం టీ 20 మ్యాచ్
- భారత్ - బంగ్లాదేశ్ టీమ్‌ల మధ్య మూడో టీ 20 మ్యాచ్
- నోవాటెల్, తాజ్ బంజారా హోటల్స్‌లో భారత్, బంగ్లాదేశ్‌లకు వసతి
ఇప్పటికే మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా టీమిండియా రెండు టీ 20 మ్యాచ్‌లు గెలిచి సిరీస్ ను 2-0తో సొంతం చేసుకోగా, ఉప్పల్‌లో నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. అయితే, చాలా రోజుల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో మ్యాచ్‌ను తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) ఉప్పల్ స్టేడియంలో ఇండియా, బంగ్లాదేశ్ జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి.