Ratan TATA: రతన్ టాటా చివరి సోషల్ మీడియా పోస్ట్ ఇదే..!

Just two days ago Ratan TATA debunked the rumours circulating around his health on a social media post
  • తన ఆరోగ్యంపై వదంతుల వ్యాప్తి పట్ల స్పందించిన రతన్ టాటా
  • నిరాధారమైన ప్రచారమని చెప్పిన వ్యాపార దిగ్గజం
  • సోమవారమే సోషల్ మీడియా వేదికగా చివరి పోస్ట్ పెట్టిన రతన్ టాటా
విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచిన భారత పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్‌ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ముంబ‌యిలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో రాత్రి 11.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. అయితే రెండు రోజుల క్రితం వరకు రతన్ టాటా ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. హాస్పిటల్‌లో ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రచారంపై రతన్ టాటా  స్వయంగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సోమవారం ఆయన స్పందించారు.

‘‘నా గురించి ఆలోచిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు’' అనే క్యాప్షన్‌తో రతన్ టాటా స్పందించారు. ‘‘ నా ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల పుకార్లు వ్యాపిస్తున్నాయని నాకు తెలుసు. ఇవన్నీ నిరాధారమైనవని మీకు చెప్పాలనుకుంటున్నాను. నా వయసు సంబంధిత ఆరోగ్య పరిస్థితుల కారణంగా ప్రస్తుతం నేను వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. నేను ప్రస్తుతం ఉల్లాసంగానే ఉన్నాను ...’’ అని రతన్ టాటా పేర్కొన్నారు. కానీ రెండు రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా ఆయన కన్నుమూశారు.
Ratan TATA
TATA Group
Ratan Tata
Ratan Tata Died

More Telugu News