Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి వచ్చిన కేంద్రమంత్రి కుమారస్వామి

Union minister Kumaraswamy came to AP CM Chandrababu official residence in New Delhi
  • ఢిల్లీలో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
  • ఇవాళ నితిన్ గడ్కరీని కలిసిన చంద్రబాబు
  • అనంతరం కుమారస్వామితో కీలక సమావేశం
  • విశాఖ ఉక్కు పరిశ్రమపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ చంద్రబాబు కేంద్ర  రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్, నేషనల్ హైవేల అభివృద్ధి తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. 

ఈ సమావేశం అనంతరం, ఢిల్లీలో సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి వచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయడంపై చంద్రబాబు, కుమారస్వామి మధ్య కీలక చర్చ జరిగింది. సెయిల్ లో విలీనం అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి, కార్మికుల స్థితిగతులు మెరుగవ్వాలనే విషయాన్ని చంద్రబాబు కేంద్రమంత్రి కుమారస్వామికి స్పష్టం చేశారు.
Chandrababu
Kumaraswamy
Vizag Steel Plant
SAIL
Andhra Pradesh

More Telugu News