Chiranjeevi: ఊటీలో కోట్ల విలువైన స్థలం కొన్న చిరంజీవి

Chiranjeeti purchased costly land in Ooty
  • ఊటీ శివార్లలో ఐదున్నర ఎకరాల స్థలాన్ని కొన్న చిరంజీవి
  • దీని విలువ రూ. 16 కోట్లకు పైనే
  • ఇటీవలే ఆ స్థలాన్ని చూసిన చరణ్, ఉపాసన
తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీ శివార్లలో మెగాస్టార్ చిరంజీవి అత్యంత విలువైన ఒక స్థలాన్ని కొనుగోలు చేశారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చుట్టూ టీ తోటలు, మంచి వ్యూ పాయింట్ ఉండే ఒక కొండపై ఆయన ఐదున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారట. దీని విలువ రూ. 16 కోట్లకు పైనే ఉంటుందని చెపుతున్నారు. స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఇప్పటికే ఆ స్థలాన్ని చూసి వచ్చారట. ఒక మంచి ఆర్కిటెక్ట్ సంస్థతో అక్కడ ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరోవైపు చిరంజీవికి ఇప్పటికే బెంగళూరు, చెన్నై, గోవా, విశాఖపట్నం వంటి నగరాల్లో సొంత ప్రాపర్టీలు ఉన్నాయి.
Chiranjeevi
Tollywood
Ooty

More Telugu News