Nara Lokesh: పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తాం: మంత్రి లోకేశ్‌

Minister Nara Lokesh Says We will fulfill every Promise made in Yuva Galam Padayatra
యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు త‌మ‌ ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోంద‌ని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి తెచ్చారని, వారికి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ధూప, దీప నైవేద్య సాయం తాజాగా రూ.10 వేలకు పెంచడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. దాంతో రాష్ట్రంలోని 5,400 చిన్న ఆలయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి సేవకు ఆస్కారం ఏర్ప‌డింద‌ని తెలిపారు. అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం త‌మ‌ద‌ని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
Yuva Galam Padayatra
Andhra Pradesh

More Telugu News