డెలివ‌రీ బాయ్‌గా వెళ్లిన జొమాటో సీఈఓకు ఊహించ‌ని షాక్‌..!

Shocking Experience to Zomato CEO Deepinder Goyal while Collecting Order
విధుల్లో ఉండ‌గా డెలివ‌రీ బాయ్స్ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకునేందుకు జొమాటో సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ డెలివ‌రీ బాయ్‌గా వెళ్లారు. అయితే ఓ మాల్‌లో ఆర్డ‌ర్‌ను క‌లెక్ట్ చేసుకునే క్ర‌మంలో ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. 

అక్క‌డి సెక్యూరిటీ సిబ్బంది దీపింద‌ర్‌ను లిఫ్ట్‌లోకి ఎక్క‌కుండా అడ్డుకున్నారు. దాంతో చేసేదేమిలేక మెట్ల మార్గంలోనే మూడో అంత‌స్తుకు వెళ్లి ఆర్డ‌ర్ తీసుకున్న‌ట్లు త‌న‌కు ఎదురైన షాకింగ్‌ అనుభ‌వాన్ని తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఆయ‌న‌ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక పోస్టు పెట్టారు. 

ఈ సంఘ‌ట‌న‌తో డెలివ‌రీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా మాల్స్‌తో క‌లిసి జొమాటో మ‌రింత సాన్నిహిత్యంగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విషయం త‌న‌కు బోధ‌ప‌డింద‌ని అన్నారు. దీనిపై మీరేమ‌నుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియ‌జేయం‌డంటూ నెటిజ‌న్లను కోరారు.
Go Back to Shorts
Deepinder Goyal
Zomato

More Telugu News