Lalu Prasad Yadav: లాలు ప్రసాద్ యాదవ్, తేజస్వీయాదవ్‌కు ఊరట.. ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కేసులో బెయిలు

Lalu PrasadYadav and His Sons granted bail in land for jobs case


‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్, ఆయన తనయులు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. కొద్దిసేపటి క్రితం బెయిలు మంజూరు చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే బెయిలు మంజూరు చేస్తూ ఒక్కొక్కరు రూ. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా వారిని అరెస్ట్ చేయరాదని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ముగ్గురూ తమ పాస్‌పోర్టులను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

Lalu Prasad Yadav
Tejashwi Yadav
Tej Pratap Yadav
Bihar
Rouse Avenue Court
Land-For-Jobs case
  • Loading...

More Telugu News