dussehra sharannavaratri celebration: లలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లి

dussehra  sharannavaratri celebrations on indrakeeladri temple in vijayawada
  • ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
  • భక్తజన సందోహంతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
  • పున్నమి ఘాట్ నుండి వీఐపీ వాహనాలు కొండ పైకి అనుమతి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నాల్గవరోజైన ఆదివారం దుర్గమ్మ లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వీఐపీల దర్శనాల విషయంలో అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. పాసుల జారీకి ప్రత్యేక యాప్‌తో పాటు సమన్వయ అధికారులను ఏర్పాటు చేస్తున్నారు. 21 కేటగిరీల్లో వీఐపీ పాసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. 

సొంత వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. వీఐపీ పాసులు ఉన్న వారి వాహనాలను కొండ దిగువన పున్నమి ఘాట్ వద్ద నుంచి అధికారులు అనుమతిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు పాలు, తాగునీరు, మెడికల్ వసతులను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు పోలీసు సేవాదళ్, రెడ్ క్రాస్ వాలంటీర్లు చర్యలు చేపడుతున్నారు.
dussehra sharannavaratri celebration
indrakeeladri
Vijayawada

More Telugu News