అభిమాని కోరిక తీర్చిన ఏపీ సీఎం చంద్రబాబు
- రేణిగుంట విమానాశ్రయం వద్ద అభిమానితో ఫోటో దిగిన సీఎం చంద్రబాబు
- అభిమాని సురేంద్రబాబు వైద్య ఖర్చుల కోసం రూ.5లక్షల సాయం అందజేసి భరోసా ఇచ్చిన చంద్రబాబు
- అభిమాన నాయకుడి పలకరింపుతో సంతోషం వ్యక్తం చేసిన సురేంద్రబాబు
ఈ నేపధ్యంలో తిరుమల పర్యటన ముగించుకుని శనివారం రేణిగుంటలో విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వెళుతున్న చంద్రబాబు విమానాశ్రయం గేటు వద్ద వాహనం దిగి సురేంద్రబాబును పరామర్శించారు. ఫోటో దిగాలన్న అతని కోరికను నెరవేర్చడంతో పాటు సురేంద్రబాబుకు చికిత్స నిమిత్తం రూ.5లక్షల చెక్కును అందించారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని, భయపడొద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తమ అభిమాన నేత ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగడంతో సురేంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశాడు.