Chandrababu: తిరుమల వేంకటేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu offers holy clothing to Tirumala Venkateswara Swamy
  • తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • సతీసమేతంగా విచ్చేసిన సీఎం చంద్రబాబు
  • ఘనస్వాగతం పలికిన మంత్రి ఆనం, టీటీడీ అధికారులు
నేటి నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. తిరుమల కొండపై పద్మావతి అతిథి గృహం వద్ద చంద్రబాబుకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. 

సీఎం చంద్రబాబు సతీసమేతంగా వెంకన్నస్వామికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం, టీటీడీ క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరించారు. కాగా, చంద్రబాబు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద శేష వాహన సేవలోనూ పాల్గొననున్నారు.
Chandrababu
Tirumala
TDP
Andhra Pradesh

More Telugu News