Nara Lokesh: ఏపీలో పారా క్రీడల అభివృద్ధికి లోకేశ్ హామీ

we will work for the development of para sports nara lokesh
  • ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ ను కలిసిన పారా క్రీడాకారులు
  • పారాలింపిక్స్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారుడు షేక్ అర్షద్‌ను ప్రత్యేకంగా అభినందించిన నారా లోకేశ్
  • క్రీడాకారులకు మద్దతుగా నిలుస్తామని లోకేశ్ హామీ
రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ క్రీడాకారులకు హామీ ఇచ్చారు. ఉండపల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్‌ను ఏఎమ్ఎఫ్ ఫౌండర్ ఆదిత్య మెహతా నేతృత్వంలో పారా క్రీడాకారులు కలిశారు. ఇటీవల పారిస్‌లో నిర్వహించిన పారాలింపిక్స్‌లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచిన షేక్ అర్షద్‌ను ఈ సందర్భంగా లోకేశ్ అభినందించారు. రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని, క్రీడాకారులకు మద్దతుగా నిలుస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చారు.   

Nara Lokesh
para sports
ap news

More Telugu News