నా మిత్రుడు రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: సీఎం చంద్రబాబు
- రజనీకాంత్ కు అస్వస్థత
- స్టెంట్ అమర్చిన వైద్యులు
- సోషల్ మీడియాలో స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు
తాజాగా, ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. "నా మిత్రుడు రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన ఆరోగ్యం కోసం, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
కాగా, రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, మరో రెండ్రోజుల్లో ఆయనను డిశ్చార్జి చేస్తామని అపోలో వైద్యులు వెల్లడించారు.