Andhra Pradesh: కేంద్రం వరద సాయం... ఏపీకి రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416 కోట్లు విడుదల

Centre releases Rs 5858 crore to 14 flood hit states for relief and rehabilitation
  • 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు రూ.5,858 కోట్లు విడుదల చేసిన కేంద్రం
  • అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు విడుదల
  • తక్షణ సాయంగా నిధులు మంజూరు చేసిన కేంద్ర హోంశాఖ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్ల నిధులను విడుదల చేసింది. తెలంగాణకు రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లను విడుదల చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,432 కోట్లను ఇచ్చింది.

గుజరాత్‌కు రూ.600 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లను కేటాయించింది. రాష్ట్ర విపత్తు నిధికి ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్రం వాటాగా ఈ మేరకు నిధులను విడుదల చేసింది.

ఇటీవల భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కేరళ సహా వరద ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. వరదల వల్ల ఆయా రాష్ట్రాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ నివేదిక ఇచ్చాయి. దీంతో తక్షణ సాయంగా కేంద్ర హోంశాఖ నిధులను మంజూరు చేసింది.
Andhra Pradesh
Telangana
BJP
Floods
Central Government

More Telugu News