Tejaswi Madivada: బిగ్ బాస్ ను తలదన్నే రియాలిటీ షోలో తెలుగు హీరోయిన్.. వీడియో ఇదిగో!

Tejaswi Madivada In Reality Raanis Of The Jungle Show
  • రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్ లో పాల్గొంటున్న తేజస్వీ మదివాడ
  • అడవిలో ఉంటూ దొరికింది తింటూ టాస్కులు చేయాలంటున్న నిర్వాహకులు
  • డిస్కవరీ ఇండియా ఛానల్ లో వారంలో రెండు రోజుల ప్రసారం
బిగ్ బాస్.. బుల్లితెరపై రియాలిటీ షోలకు ప్రాచుర్యం తెచ్చిన షో. సెలబ్రెటీలను ఓ ఇంట్లో ఉంచి వివిధ టాస్కులు చేయించడం ఇందులో ప్రధానమైన కాన్సెప్ట్. ప్రేక్షకులను ఈ కాన్సెప్ట్ బాగా ఆకట్టుకుంది. అయితే, దీనిని తలదన్నే స్థాయిలో బాలీవుడ్ మరో రియాలిటీ షోను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజమైన అడవిలో ఉంటూ, ప్రమాదాలను ఎదుర్కొంటూ సాహసం చేసే షోను డిజైన్ చేసింది. అడవిలో దొరికే ఆహారాన్ని తీసుకుంటూ వివిధ టాస్కులు పూర్తిచేస్తూ పార్టిసిపెంట్లు ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఈ షో పేరు ‘రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్’. మొత్తం 12 మంది మహిళలు.. అవును మహిళా సెలబ్రెటీలు మాత్రమే పాల్గొనే ఈ షో మరింత జనరంజకంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. తాజాగా ఈ షోలో మన తెలుగు హీరోయిన్ తేజస్వీ మదివాడ పాల్గొంటున్నారు. 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన తేజస్వీ.. రామ్ గోపాల్ వర్మ సినిమా ఐస్ క్రీంలో హీరోయిన్ గా నటించింది. దీంతో పాటు పలు సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు బిగ్ బాస్ లోనూ తేజస్వీ పాల్గొంది. తాజాగా రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్ షోలో సాహసోపేతమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ రియాలిటీ షోలో మొత్తం 12 మంది మహిళలు పాల్గొంటారు. టాస్కుల్లో ఫెయిలైన వారిని ఎలిమినేట్ చేస్తారు. అన్ని టాస్కులు పూర్తి చేసిన వారికి జంగిల్ రాణి టైటిల్ దక్కుతుంది. డిస్కవరీ ఇండియా ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రతీ సోమ, మంగళవారాలు రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తోంది.

Tejaswi Madivada
Bigboss
Reality Raanis
Bollywood Show
Discovery Channel

More Telugu News