hamas lebanon chief: హమాస్ లెబనాన్ చీఫ్ ను కూడా కడతేర్చిన ఇజ్రాయెల్!

idf says head of lebanon branch of pflp hamas lebanon chief eliminated

  • హిజ్బుల్లా లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్
  • హమాస్ లెబనాన్ చీఫ్ ఫతే షెరీఫ్ కూడా హతమైనట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)
  • హిజ్బూల్లాతో కలిసి షెరీఫ్ పని చేసేవాడని వెల్లడించిన ఐడీఎఫ్

హిజ్బుల్లా లక్ష్యంగా గత కొన్ని రోజులుగా భీకర దాడులు నిర్వహిస్తున్న ఇజ్రాయిల్ ..అగ్రనేతలందరినీ ఒక్కొక్కరినీ అంతమొందిస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా ముఖ్యనేతలు అందరూ హతమైన విషయం తెలిసిందే. తాజాగా లెబనాన్‌లో హమాస్ అధినేత ఫతే షెరీఫ్ కూడా హతమైయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. 

ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన దాడిలో ఉగ్రవాద సంస్థ హమాస్ లెబనాన్ అధిపతి ఫతే షెరీఫ్ ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది. హిజ్బుల్లాతో కలిసి షెరీఫ్ పని చేసేవాడని, ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకునే వాడని ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడించింది. ఇజ్రాయెల్‌కు ముప్పు తలపెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజన్సీలో ఫతే షెరీఫ్ గుర్తింపు పొందిన సభ్యుడని పేర్కొంది.

hamas lebanon chief
IDF
Fateh Sharif
  • Loading...

More Telugu News