Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’ నుంచి బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్ విడుదల

Brahmanandam and Sapthagiri look revealed by Kannappa team
  • మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్... కన్నప్ప
  • ప్రతి సోమవారం ఒక అప్ డేట్ విడుదల
  • 'పిలక' పాత్రలో బ్రహ్మానందం, 'గిలక' పాత్రలో సప్తగిరి
టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే ప్రకటించిన మంచు విష్ణు... తన చిత్రం నుంచి ప్రతి సోమవారం ఒక అప్ డేట్ వదులుతున్నాడు. ఇప్పటికే చిత్రంలోని కీలక పాత్రధారుల ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా... తాజాగా కమెడియన్లు బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల లుక్ ను పంచుకున్నారు. 

బ్రహ్మానందం ఈ చిత్రంలో పిలక పాత్రను, సప్తగిరి గిలక పాత్రను పోషించారు. "చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట... నేర్పిన గుగ్గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే..." అంటూ ఈ గురువులిద్దరి పాత్రలను అందరికీ పరిచయం చేశారు. చూస్తుంటే వీరిద్దరి కామెడీ కన్నప్ప చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ కానున్నట్టుగా కనిపిస్తోంది. 

కన్నప్ప నుంచి ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్, తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి, మారెమ్మ పాత్రకు సంబంధించిన నటి ఐశ్వర్య లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 

వా ఎంటర్టయిన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.
Kannappa
Brahmanandam
Sapthagiri
First Look
Manchu Vishnu
Mohan Babu
Mukesh Kumar Singh

More Telugu News