CJI Chandrachud: తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్

Supreme Court Chief Justice DY Chandrachud offers prayers in Tirumala temple
  • కుటుంబ సమేతంగా తిరుమల విచ్చేసిన సీజేఐ
  • వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలో ప్రవేశం
  • వేదాశీర్వచనం అందించిన అర్చకులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీజేఐ చంద్రచూడ్, ఆయన అర్ధాంగి కల్పనా దాస్, ఇతర కుటుంబ సభ్యులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. 

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. టీటీడీ ఈవో జె.శ్యామలరావు జస్టిస్ చంద్రచూడ్ కు లామినేషన్ చేసిన వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. 

అంతకుముందు, సీజేఐ కుటుంబానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి స్వాగతం పలికారు.
CJI Chandrachud
Tirumala
Supreme Court
Andhra Pradesh
India

More Telugu News