Manchu Vishnu: చంద్రబాబు బొమ్మ గీసిన మంచు విష్ణు... ఫొటో ఇదిగో!

Manchu Vishnu showcased his artwork of AP CM Chandrababu
  • నిన్న ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మోహన్ బాబు, మంచు విష్ణు
  • వరద బాధితుల సహాయార్థం రూ.25 లక్షల విరాళం అందజేత
  • మంచు విష్ణు గీసిన తన బొమ్మపై చంద్రబాబు ఆటోగ్రాఫ్
ఏపీలో వరద బాధితుల సహాయార్థం ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు నిన్న సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందించడం తెలిసిందే. తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి అమరావతి వచ్చిన మోహన్ బాబు... చంద్రబాబుకు రూ.25 లక్షల చెక్కు అందజేశారు. దీనిపై ఇవాళ మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

"ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసే భాగ్యం దక్కింది. ఏపీలో వరద బాధితుల రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షల చెక్ అందించాం. కన్నప్ప చిత్ర విశేషాలతో పాటు, ఇంకా అనేక సంగతులు చంద్రబాబు గారితో మాట్లాడాం. నేను గీసిన ఆయన బొమ్మపై ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. చంద్రబాబు గారికి మరింత శక్తి లభించాలని కోరుకుంటున్నాను" అంటూ మంచు విష్ణు పేర్కొన్నారు.
Manchu Vishnu
Chandrababu
Artwork
Mohan Babu
AP Floods

More Telugu News