Viral Videos: మన రైళ్లలో ఇలాంటి సీన్ ఎవరూ ఎప్పుడూ చూసుండరు.. వీడియో ఇదిగో!

Man Uses Bedsheet To Make A Hammock And Sleeps In Overcrowded Train
  • ప్రయాణికులతో పూర్తిగా కిక్కిరిసిపోయిన రైలు జనరల్ బోగీ
  • అడుగు తీసి అడుగు వేసేందుకు కూడా లేని చోటు
  • రైలు బెర్త్‌లకు ఉయ్యాలలా కట్టి నిద్రపోయిన యువకుడు
  • ఇండియాలో టాలెంట్‌కు కొదవలేదంటున్న యూజర్లు
కదనరంగంలో అయినా అవలీలగా కదలొచ్చేమో కానీ.. మన రైళ్లలోని జనరల్ బోగీల్లో ప్రయాణించడం మాత్రం అంత వీజీ కాదు. ఎంతో గుండెధైర్యం మాత్రమే కాదు.. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే తెలివి ఉంటే తప్ప జనరల్ బోగీలో వెళ్లడం దాదాపు అసాధ్యం. బుల్లెట్ రైళ్ల వైపు దేశం శరవేగంగా దూసుకెళ్తున్నా, వందేభారత్ పేరుతో అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి వచ్చిన దేశంలోని ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని జనరల్ బోగీల పరిస్థితిలో మాత్రం ఇసుమంతైనా మార్పు రావడం లేదు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. 

అడుగుతీసి అడుగు వెయ్యడానికి కూడా ఖాళీలేని ఓ రైలులోని జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు పైన ఉండే బెర్త్‌లు రెండింటికీ ఓ దుప్పటిని ఉయ్యాల్లా కట్టి అందులో ఎంచక్కా నిద్రపోయాడు. రైలులో ఆ సమయంలో అందరూ నిద్రలో జోగుతున్నారు. దీనిని బట్టి అది రాత్రివేళ అని అర్థమవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటికే 15 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది.

 ఇండియాలో టాలెంట్ లేదని ఎవరు చెప్పారు? అని ఒక యూజర్ రాసుకొచ్చాడు. దేశంలో ఎంతోమంది తమ నైపుణ్యంతో ఇలా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారని మరో అంటే.. ఇలాంటి ఐడియాల్లో ఇండియన్స్ ఫేమస్ అని మరొకరు రాసుకొచ్చారు. మన ఇండియాలో కావాల్సినంత టాలెంట్ ఉంది.. అది ప్రదర్శించుకునే అవకాశమే లేదు అని మరో యూజర్ పేర్కొన్నాడు. కాగా, ఈ రైలు పేరు, అది ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్తోందన్న వివరాలు తెలియరాలేదు.
Viral Videos
Indian Train
Offbeat Article

More Telugu News