Hezbollah: హిజ్బుల్లాకు మరో ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడుల్లో ఆ సంస్థ చీఫ్ కుమార్తె మృతి

Hezbollah Chief Nasrullah Daughter Zainab Died In Israel Attacks

  • లెబనాన్ రాజధాని బీరుట్‌పై దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
  • మొన్న హిజ్బుల్లా డ్రోన్ చీఫ్ హుస్సీన్ సురౌర్ హతం
  • తాజాగా చీఫ్ నస్రుల్లా కుమార్తె జైనాబ్ మృతి చెందినట్టు కథనాలు
  • ధ్రువీకరించని లెబనాన్, హిజ్బుల్లా 

హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా లెబానాన్‌పై దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. మొన్న బీరుట్‌పై జరిపిన దాడుల్లో హిజ్బుల్లా డ్రోన్ చీఫ్ మొహమ్మద్ హుస్సీన్ సురౌర్‌ మృతి చెందగా, తాజా దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా కుమార్తె జైనాబ్ మృతి చెందినట్టు తెలిసింది. దక్షిణ బీరుట్‌లో హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో ఆమె మరణించినట్టు సమాచారం. ఇజ్రాయెల్ న్యూస్ చానల్ ‘చానల్ 12’లో  జైనాబ్ నస్రుల్లా మృతిపై కథనాలు వచ్చినప్పటికీ హిజ్బుల్లా నుంచి కానీ, లెబనాన్ అధికారుల నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

జైనాబ్ తొలి నుంచి హిజ్బుల్లాకు గట్టి మద్దతుదారుగా ఉంది. 1997 ఇజ్రాయెల్ దళాల దాడుల్లో సోదరుడు హడీ మృతి చెందినప్పుడు కూడా ఆమె స్పందించారు. జైనాబ్ మృతి కనుక నిజమే అయితే హిజ్బుల్లాకు అది గట్టి ఎదురుదెబ్బే అవుతుంది. కాగా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ నస్రుల్లా కూడా మృతి చెందినట్టు చెబుతున్నారు. తమ దాడుల నుంచి ఆయన తప్పించుకున్నాడంటే నమ్మలేమని ఇజ్రాయెల్ డిఫెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

Hezbollah
Lebanon
Israel Attacks
Zainab Nasrullah
  • Loading...

More Telugu News