reliance foundation: ఏపీ సీఎం సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం

reliance foundation donates rs 20 crore Andhra Pradesh CMRF
  • ఏపీలో ఇటీవల వరద బీభత్సం
  • రిలయన్స్ రూ.20కోట్ల విరాళం 
  • చెక్కును చంద్రబాబుకు అందించిన ప్రతినిధులు
ఏపీలో వరద బాధితుల సహాయార్ధం రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.20కోట్లు అందజేసింది. రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తరపున రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ గ్రూపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మెంటార్ పీవిఎల్ మాధవరావులు శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రూ.20కోట్ల చెక్కును అందజేశారు. 

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రిలయన్స్ ఫౌండేషన్‌ను అభినందించారు. రిలయన్స్ ఫౌండేషన్ అటు తెలంగాణ రాష్ట్రానికి కూడా రూ.20కోట్ల వితరణ అందించింది.
reliance foundation
ap floods
CMRF

More Telugu News