Chiranjeevi: చిరంజీవికి మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం

Megastar Chiranjeevi receives the Outstanding Achievement in Indian Cinema award at the IIFA event in Abu Dhabi
  • అబుదాబిలో ఘ‌నంగా ఐఐఎఫ్ఏ అవార్డ్స్ 2024 వేడుక‌
  • చిరుకు 'ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియ‌న్ సినిమా'  అవార్డు
  • ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన టాలీవుడ్ న‌టీన‌టులు
  • ఇటీవ‌లే మెగాస్టార్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌లో చోటు
మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం ద‌క్కింది. అబుదాబిలో జ‌రుగుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియ‌న్ ఫిల్మ్ అకాడ‌మీ (ఐఐఎఫ్ఏ) అవార్డ్స్ 2024 వేడుక‌ల్లో చిరు 'ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియ‌న్ సినిమా' పుర‌స్కారం అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలుగు హీరోలు వెంక‌టేశ్‌, బాల‌కృష్ణ‌, యువ హీరోలు ద‌గ్గుపాటి రాణా, సుశాంత్‌, ఇత‌ర న‌టీన‌టులు కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్‌ను రాణా, బాల‌కృష్ణ అభినందించారు. 

అలాగే బాల‌య్య‌కు 'గోల్డెన్ లెగసీ' అవార్డు ద‌క్కింది. ఇక హీరోయిన్ స‌మంత 'ఉమెన్ ఆఫ్ ది ఇయ‌ర్' అవార్డు గెలుచుకున్నారు. నానికి ఉత్త‌మ న‌టుడు అవార్డు ద‌క్క‌గా, 'మిస్‌శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి' చిత్రానికి ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫీ పుర‌స్కారం వ‌రించింది. 

ఇక ఇటీవ‌లే చిరంజీవి ప్ర‌తిష్ఠాత్మ‌క గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌లో చోటు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. 46 ఏళ్ల త‌న సినీ జీవితంలో 156 చిత్రాలు, 537 పాట‌లు, 24వేల డ్యాన్స్ స్టెప్పుల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించినందుకు చిరు ఈ రికార్డు ద‌క్కించుకున్నారు. ఇప్పుడు ఐఐఎఫ్ఏ అవార్డ్స్ 2024లో మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం ద‌క్కించుకోవ‌డంతో మెగా అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Chiranjeevi
Outstanding Achievement in Indian Cinema Award
Abu Dhabi
Tollywood

More Telugu News