Mohan Babu: సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందించిన మోహన్ బాబు

Mohan Bbau handed over Rs 25 lakhs cheque to AP CM Chandrababu
  • ఏపీలో ఇటీవల వరద బీభత్సం
  • సీఎం రిలీఫ్ ఫండ్ కు మోహన్ బాబు విరాళం
  • రూ.25 లక్షల చెక్ ను చంద్రబాబుకు అందించిన మోహన్ బాబు, విష్ణు
ఏపీలో ఇటీవల వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వరద బాధితుల సహాయార్థం ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందించారు. 

ఇవాళ మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వరద బాధితుల కోసం రూ.25 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మోహన్ బాబును సీఎం చంద్రబాబు అభినందించారు. ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు.
Mohan Babu
Donation
Chandrababu
AP Floods
Tollywood

More Telugu News