YS Sharmila: జగన్ హయాంలోనే తిరుమల లడ్డూలో కల్తీ... సీజేఐకి లేఖ రాశాను: వైఎస్ షర్మిల

Tirumala laddu adulterated in Jagans reign says YS Sharmila
  • లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలిందన్న షర్మిల
  • నిజానిజాలు ప్రజలకు తెలియాలని వ్యాఖ్య
  • తిరుమల డిక్లరేషన్ అందరికీ వర్తిస్తుందన్న షర్మిల
తిరుమల లడ్డూ కల్తీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆమె అన్నారు. పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ దారుణ ఘటనపై ప్రజలకు నిజానిజాలు తెలియాల్సి ఉందని అన్నారు. 

లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను లేఖ రాశానని షర్మిల తెలిపారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సీజేఐని కోరామని చెప్పారు. తిరుమల డిక్లరేషన్ రూల్ అందరికీ వర్తిస్తుందని... ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాల్సిందేనని అన్నారు.
YS Sharmila
Congress
Jagan
YSRCP
Laddu

More Telugu News