బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో యువకుడి జననాంగాలకు నిప్పంటించిన స్నేహితులు... వీడియో వైరల్!
- స్నేహితుడి బర్త్‌డేలో యువకుల అతి
- నిద్రలో ఉన్న యువకుడి జననంగాలకు నిప్పు పెట్టిన వైనం
- ఆ తర్వాత హ్యాపీ బర్త్‌డే అంటూ కేకలు
'ఘర్ కే కాలేష్' అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ వీడియో రెండు రోజుల క్రితం పోస్ట్ అయింది. కొందరు మిత్రులు ఓ యువకుడు గదిలో నిద్రపోతున్న సమయంలో అతని వద్దకు వచ్చారు. ఆ తర్వాత తమతో పాటు తెచ్చుకున్న ఓ లిక్విడ్‌ను నిద్రలో ఉన్న యువకుడి జననాంగాలపై పోసి నిప్పంటించారు. అనంతరం హ్యాపీ బర్త్ డే అంటూ గట్టిగా అరవడం చేశారు.
దాంతో ఒక్కసారిగా నిద్రలేచిన యువకుడు నిప్పును ఆర్పివేసి, వారిని కొట్టడానికి వెళ్లడం వీడియోలో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయం తెలియదు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.