Bengaluru Horror: మహలక్ష్మిని అందుకే చంపేశా.. సూసైడ్ లేఖలో విషయాలు బయటపెట్టిన నిందితుడు

Mukti Ranjan Roy Who Committed Suicide In Mahalakshmi Murder Case

  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహలక్ష్మి హత్యకేసు
  • భయంతో చెట్టుకు ఉరివేసుకున్న నిందితుడు ముక్తిరంజన్
  • సూసైడ్ నోట్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ స్వాధీనం

బెంగళూరులో సంచలనం సృష్టించిన మహలక్ష్మి హత్యకేసులో నిందితుడు ముక్తిరంజన్ రాయ్ ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో వెల్లడించిన విషయాలతో మర్డర్ మిస్టరీ వీడింది. మహలక్ష్మిని హత్యచేసి ముక్కలుగా కోసి వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టిన నిందితుడు ఆ తర్వాత తన స్వగ్రామమైన ఒడిశాలోని ఫండి గ్రామంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. తన కోసం వెతక్కుంటూ పోలీసు బృందాలు ఒడిశా వస్తున్నాయని తెలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతడు రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మహలక్ష్మి తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ దాడిచేసి తనను కొట్టిందని, ఆత్మాభిమానం దెబ్బతినడంతో తిరిగి దాడిచేసి ఆమె గొంతు నులిమి చంపేశానని అందులో పేర్కొన్నాడు. మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి హెక్సాబ్లేడ్‌తో ఆమె శరీరాన్ని 59 ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో ఉంచానని, వాసన రాకుండా కెమికల్స్ చల్లానని లేఖలో వివరించాడు. ఆ తర్వాత బాత్రూమును శుభ్రం చేసి ఇంటికి తాళం వేసి రైలులో ఒడిశాలోని తన ఇంటికి చేరుకున్నట్టు రాసుకొచ్చాడు.

Bengaluru Horror
Mahalakshmi
Mukti Ranjan Roy
Odisha
  • Loading...

More Telugu News