Crime News: ఏఐ సాయంతో టీచర్ అశ్లీల ఫొటోలు రూపొందించిన విద్యార్థులు... యూపీలో దారుణం

obscene act 9th class students created obscene photo teacher with ai made it viral on instagram
  • యూపీలోని మొరాదాబాద్ లో ఘటన 
  • మానసిక ఒత్తిడికి గురైన ఉపాధ్యాయురాలు
  • బాధ్యులైన ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులపై కేసు నమోదు
  • సైబర్ సెల్ సాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ మనీష్ సక్సేనా
యూపీలో ఓ దారుణ ఘటన జరిగింది. ఉపాధ్యాయులను గౌరవిస్తూ మంచిగా చదువుకుని ప్రయోజకులు కావాల్సిన ఇద్దరు విద్యార్ధులు పెడదారి పట్టి నీచమైన పని చేసి పోలీస్ కేసులో ఇరుక్కొని తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకున్నారు. సాంకేతిక విద్యను మంచికి ఉపయోగించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాల్సిన విద్యార్ధులు దాన్ని మిస్ యూజ్ చేస్తూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. 

విషయంలోకి వెళితే.. యూపీలోని మొరాదాబాద్ లోని ఓ ప్రతిష్టాత్మక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో వారి ఉపాధ్యాయురాలి ఫోటోలను అశ్లీలంగా రూపొందించి సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్)లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా మరికొందరు విద్యార్ధులు, ఉపాధ్యాయుల ఫోటోలతో ఇలాంటివి రూపొందించి వాటినీ వైరల్ చేస్తామని బెదిరించారు. ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ జరిగి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధిత ఉపాధ్యాయురాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.

దీనిపై ఆమె సివిల్ లైన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత టీచర్ ఫిర్యాదు మేరకు ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ మనీష్ సక్సేనా తెలిపారు. సైబర్ సెల్ సాయంతో దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అలానే ఇన్ స్టా నుండి బాధిత ఉపాధ్యాయురాలి ఫోటోల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Crime News
Students
Instagram
AI
obscene photo

More Telugu News