Lion: పిల్లల ప్రాణాలతో తండ్రి చెలగాటం.. సింహం వీపు మీదకి ఎక్కించి ఫొటో షూట్.. ఆ తర్వాత జరిగింది ఇదీ!

Man Plays With the Life of His Children Keeps Them on Lions Back for Photoshoot
  • ఇన్‌స్టాగ్రామ్‌‌లో వైరల్ అవుతున్న వీడియో
  • పిల్లలను సింహం వీపుపైకి ఎక్కించి కలిసి ఫొటోలు
  • విరుచుకుపడుతున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలన్న పిచ్చితో ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. రీల్స్ చేస్తూ కొందరు, స్టంట్స్ చేస్తూ మరికొందరు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట వెలుగు చూస్తున్నా మార్పు మాత్రం కనిపించడం లేదు. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో ఇలాంటి కోవకు చెందినదే. 

సింహంతో ఫొటో దిగాలనుకున్న ఓ వ్యక్తి తొలుత తన కుమారుడిని సింహం వీపు పైకి ఎక్కించాడు. పిల్లాడు భయపడుతున్నా బలవంతంగా దానిపై కూర్చోబెట్టి ఇద్దరూ కలిసి ఫొటో దిగారు. ఆ తర్వాత మరో కుమారుడిని కూడా ఎక్కించాడు. ఇంత జరుగుతున్నా సింహం మాత్రం కాసేపు ఓపిగ్గానే ఉంది. ఆ తర్వాత ఓపిక నశించి ఒక్కసారిగా తల విసరడంతో భయంతో హడలిపోయారు. వారు కాసేపు అక్కడే ఉండి అలాగే ప్రవర్తించి ఉంటే ముగ్గురూ దానికి ఆహారంగా మారిపోయేవారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ తండ్రిపై విరుచుకుపడుతున్నారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, అతడసలు మంచి తండ్రి కానేకాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు తన పరిధిని దాటాడని మరికొందరు మండిపడుతున్నారు. మరికొందరేమో ఆ సింహానికి మత్తు మందు ఇచ్చి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ఎవరో ఒకరు దాని నోటికి చిక్కేంత వరకు ఇది సరదాగానే ఉంటుందని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. అయితే, ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయం తెలియరాలేదు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Lion
Viral Video
Offbeat

More Telugu News