urmila matondkar: వైవాహిక బంధానికి ముగింపు పలికిన సినీ నటి ఊర్మిళ?

urmila matondkar files for divorce from mohsin akhtar
  • 8 ఏళ్ల క్రితం మోడల్ మోసిన్ అక్తార్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న ఊర్మిళ 
  • విడాకుల కోసం ఊర్మిళ కోర్టును ఆశ్రయించినట్లు జాతీయ మీడియా వెల్లడి
  • ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో యాక్టివ్ సభ్యురాలిగా ఊర్మిళ
ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ తన భర్త మోసిన్ అక్తార్ తో వైవాహిక బంధానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విడాకుల కోసం ఆమె ముంబయి కోర్టులో నాలుగు నెలల క్రితం పిటిషన్ దాఖలు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ విషయంపై ఊర్మిళ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. తన కంటే వయసులో పదేళ్ల చిన్నవాడైన మోడల్ మోసిన్ అక్తార్‌ను ఊర్మిళ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడం లేదని, ఊర్మిళే కోర్టును ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. 

బాలీవుడ్‌లో కర్మ్ మూవీతో బాల నటిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఊర్మిళ .. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అంతం మూవీతో టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత ఆర్జీవీ దర్శకత్వంలోనే అనగనగా ఒక రోజు, రంగీలా, సత్య మూవీలతో బ్లాక్ బస్టర్‌లు అందుకుంది. కమల్ హాసన్ నటించిన ఇండియన్ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించిన ఊర్మిళ .. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరి ఆ పార్టీలో యాక్టివ్ సభ్యురాలిగా ఊర్మిళ కొనసాగుతున్నారు.
urmila matondkar
Divorce
mohsin akhtar
Movie News

More Telugu News