New Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీకి జెడ్ కేటగిరీ భద్రత

Delhi CM Atishi gets Z category security cover days after taking charge
  • సీఎం కాన్వాయ్‌లో పైలట్‌తో సహా పోలీసు సిబ్బందితో భద్రత
  • ప్రోటోకాల్ ప్రకారం ఢిల్లీ సీఎం జెడ్ కేటగిరీకి అర్హులు
  • షిఫ్ట్‌ల వారీగా పని చేయనున్న 22 మంది సిబ్బంది
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీకి దేశ రాజధాని పోలీసులు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించారు. సీఎం కాన్వాయ్‌లో పైలట్‌తో సహా పోలీసు సిబ్బందితో భద్రతను కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రోటోకాల్ ప్రకారం, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ సీఎం జెడ్ కేటగిరీ భద్రతకు అర్హులు. జెడ్ కేటగిరీ భద్రత కోసం 22 మంది సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా ఉంటారు. జెడ్ కేటగిరీ భద్రతలో పీఎస్వోలు, ఎస్కార్ట్స్, సాయుధ గార్డులు ఉంటారు.

అతిశీ కేబినెట్ తొలి నిర్ణయం ఇదే

ఢిల్లీలో అసంఘటిత రంగ కార్మికుల వేతానాన్ని పెంచుతూ అతిశీ ప్రభుత్వం తొలి నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త వేతనం ధరలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి అతిశీ వెల్లడించారు. ఈ నిర్ణయంతో నైపుణ్యం లేని కార్మికుల కనీస వేతనం రూ.18,066, మధ్యస్త నైపుణ్యం కలిగిన వారి వేతనం రూ.19,929, మెరుగైన నైపుణ్యం కలిగిన వారి వేతనం రూ.21,917కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
New Delhi
Atishi
Chief Minister

More Telugu News