Aishwarya Rai: విడాకుల పుకార్లపై ఐశ్వర్యారాయ్ ఇలా స్పందించారు!

Aishwarya Rai spotted with wedding ring at Paris Fashion Week
  • అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడిపోతున్నారంటూ పుకార్లు
  • ఎప్పటికప్పుడు పరోక్షంగా ఖండిస్తూనే ఉన్న బాలీవుడ్ జోడీ
  • పారిస్ ఫ్యాషన్ వీక్ లో వెడ్డింగ్ రింగ్ తో కనిపించిన ఐశ్వర్య
బాలీవుడ్ జోడీ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ పెళ్లి పెటాకులైందని, వారు విడిపోతున్నారని ఎప్పట్నించో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. "అంతా అయిపోయింది" అంటూ గతంలో అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ తో విడాకుల వార్తలు పతాకస్థాయికి చేరాయి. 

అయితే, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ ఎప్పటికప్పుడు పరోక్షంగా ఖండిస్తూనే ఉన్నప్పటికీ, పుకార్లకు మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. వారిద్దరూ కలిసి పబ్లిక్ గా కనిపిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతూనే ఉంది. 

తాజాగా, ఐశ్వర్యారాయ్ మరోసారి తనదైన శైలిలో విడాకుల పుకార్లపై స్పందించారు. ఈసారి చేతి వేలికి పెళ్లి నాటి ఉంగరం ధరించి ఫొటో సెషన్ కు హాజరయ్యారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న పారిస్ ఫ్యాషన్ వీక్ కు ఐశ్వర్యారాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు. ఆమె చేతి వేలికి వెడ్డింగ్ రింగ్ ఉండడంతో విడాకుల ఊహాగానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది.
Aishwarya Rai
Wedding Ring
Paris Fashion
Abhishek Bachchan
Bollywood

More Telugu News