Daggubati Purandeswari: పురందేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం

Centre appoints Purandeswari as Commonwealth Parliamentary Steering Committee Chairperson
  • కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా పురందేశ్వరి
  • రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న రాజమండ్రి ఎంపీ
  • నేడు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ
ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పురందేశ్వరి ఈ పదవిలో 2026 వరకు కొనసాగనున్నారు. తాజా నియామకం నేపథ్యంలో, పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న ఊహాగానాలకు తెరపడినట్టయింది. కాగా, పురందేశ్వరి కామన్వెల్త్ పార్లమెంటరీ కమిటీ భారత ప్రాంతీయ ప్రతినిధిగానూ నామినేట్ అయ్యారు.
Daggubati Purandeswari
Chairperson
Commonwealth Parliamentary Steering Committee
BJP

More Telugu News