కావూరీహిల్స్ పార్క్ లోని స్పోర్ట్స్ అకాడమీని తొలగించిన హైడ్రా
- కావూరీహిల్స్ పార్క్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
- అసోసియేషన్ నుంచి లీజుకు తీసుకున్నామని అకాడమీ నిర్వాహకుల వివరణ
- కోర్టు ఆదేశాలతోనే తొలగించామన్న హైడ్రా చీఫ్ రంగనాథ్
కావూరీహిల్స్ పార్క్ అంటూ అధికారులు అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. అయితే, కావూరీహిల్స్ అసోసియేషన్ నుంచి ఈ స్థలాన్ని లీజుకు తీసుకుని స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. 25 ఏళ్లకు లీజుకు తీసుకున్నామని, ఆ గడువు పూర్తికాకముందే తొలగిస్తున్నారని ఆరోపించారు. అయితే, కోర్టు ఆదేశాలతోనే కావూరీహిల్స్ పార్క్ లో ఆక్రమణలను తొలగించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు.