Jetwani: నటి జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్‌కు రిమాండ్

Kukkala Vidyasagar sent to remand in actress Jetwani case
  • విద్యాసాగర్ ను డెహ్రాడూన్ లో అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఈ తెల్లవారుజామున ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు
  • అక్టోబర్ 4 వరకు రిమాండ్ విధించిన కోర్టు
ముంబై హీరోయిన్ జెత్వానీ కేసు ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. 

మరోవైపు, ఈ కేసులో నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ ను డెహ్రాడూన్ లోని ఓ రిసార్ట్ లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అక్కడి నుంచి రైలులో నిన్న రాత్రి విజయవాడకు తీసుకొచ్చారు. 

కుక్కల విద్యాసాగర్ కు వైద్య పరీక్షలు నిర్వహించి... ఈ తెల్లవారుజామున మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి విద్యాసాగర్ కు అక్టోబర్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఆయనను పోలీసులు జైలుకు తరలించారు. విద్యాసాగర్ ను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది.
Jetwani
Vidyasagar

More Telugu News