Devi Sri Prasad: ప్ర‌ధాని మోదీ సభ‌లో ఊర్రూత‌లూగించిన దేవిశ్రీ ప్ర‌సాద్‌

Devi Sri Prasad Song in PM Modi Meeting with Indian Diaspora of USA
  • భార‌తీయ ప్ర‌వాసుల‌తో స‌మావేశమైన ప్ర‌ధాని మోదీ
  • 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెద‌ర్' పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం
  • ఈ కార్య‌క్ర‌మానికి భారీ మొత్తంలో హాజ‌రైన‌ భార‌తీయులు 
  • ప్ర‌వాసుల‌ను అల‌రించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు 
  • ప్రత్యేక ఆకర్షణగా తెలుగు సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్ర‌సాద్
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అమెరికా ప‌ర్య‌ట‌నలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం ఆయ‌న న్యూజెర్సీలో భార‌తీయ ప్ర‌వాసుల‌తో స‌మావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మోదీకి ఎన్నారైల నుంచి అపూర్వ‌ స్వాగ‌తం ల‌భించింది. ఇండో-అమెరికన్ క‌మ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెద‌ర్' కార్య‌క్ర‌మానికి భారీ మొత్తంలో భార‌తీయులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ప్ర‌వాసుల‌ను అల‌రించాయి.

ప్ర‌ధానంగా రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ 'పుష్ప‌-1' మూవీలోని శ్రీవ‌ల్లి పాట‌తో ఊర్రూత‌లూగించారు. డీఎస్‌పీ 'హ‌ర్ ఘ‌ర్ తిరంగా' పాట పాడుతున్న‌ స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ వేదిక‌పైకి చేరుకున్నారు. దాంతో ఒక్క‌సారిగా క‌ర‌తాళ ధ్వ‌నులు మిన్నంటాయి.  

ఇక న‌మ‌స్తే ఇండియా అంటూ ప్ర‌వాసుల‌ను ప‌ల‌కరించిన డీఎస్‌పీ.. ప్రధాని స‌మ‌క్షంలోని త‌న పాట‌ను కొన‌సాగించారు. అనంత‌రం దేవీశ్రీతో పాటు గుజ‌రాతీ గాయ‌కుడు ఆదిత్య గాఢ్వీ, ఇత‌ర క‌ళాకారుల‌ను మోదీ అభినందించారు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికి ప్ర‌ధాని మోదీ భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చిన ప్ర‌వాస భారతీయుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

Devi Sri Prasad
PM Modi
Indian Diaspora
USA

More Telugu News