Chiranjeevi: అన్నయ్య పేరు గిన్నిస్ రికార్డుల్లో లిఖితం కావడం సంతోషదాయకం: పవన్ కల్యాణ్

Pawan Kalyan responds on Chiranjeevi Guinness Record
  • గిన్నిస్ రికార్డు నమోదు చేసిన చిరంజీవి
  • నేడు హైదరాబాదులో సర్టిఫికెట్ ప్రదానం చేసిన గిన్నిస్ బుక్ నిర్వాహకులు
  • అన్నయ్యకు రికార్డులు, విజయాలు కొత్త కాదన్న పవన్ కల్యాణ్
మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం పట్ల ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తన అన్నయ్యకు విశిష్ట ఘనత లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 

"అన్నయ్య చిరంజీవికి సినీ ప్రపంచంలో రికార్డులు, విజయాలు కొత్త కాదు. ఈ రోజు అన్నయ్య పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. 156 చిత్రాలు... 537 పాటలు... 24 వేల స్టెప్స్ తో అలరించిన నటుడిగా చిరంజీవి గారి పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. ‘ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా’ అని గౌరవించడం ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుంది. అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను" అంటూ పవన్ పేర్కొన్నారు.
Chiranjeevi
Guinness Record
Pawan Kalyan
Tollywood

More Telugu News