Tirumala Laddu: శ్రీవారి లడ్డూ ప్రసాదం.. చంద్రబాబుకు నివేదిక సమర్పించిన ఈవో

Tirumala Laddu Row TTD EO Shyamala Rao Gave Report To CM
  • దేశాన్ని కుదిపేస్తున్న తిరుమల లడ్డూ వివాదం
  • చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టీటీడీ ఈవో శ్యామలరావు
  • విస్తృత సంప్రదింపుల అనంతరం ఆలయ సంప్రోక్షణ విషయంలో ముందుకెళ్లాలని నిర్ణయం
తిరుమల లడ్డూ వివాదం దేశాన్ని కుదిపేస్తోంది. సామాన్యుల నుంచి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందించారు. తిరుమలను అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లడ్డూ అంశంపై  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె.శ్యామలరావు నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి నివేదిక సమర్పించారు. దీనిపై మరింత సమాచారాన్ని నేడు టీటీడీ అధికారులు అందించనున్నారు.

ఈవో అందించిన నివేదికపై నిన్న మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ..  ఆలయ సంప్రోక్షణ విషయంలో ఆగమ సలహాదారులు, అర్చకుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం ఆలయ సంప్రోక్షణ విషయంలో మరింత విస్తృత సంప్రదింపుల అనంతరం చర్యలు తీసుకోవాలని సూచించారు.
Tirumala Laddu
Chandrababu
TTD

More Telugu News