Raghuvaran: రఘువరన్ తమ్ముడ్ని చూశారా... అచ్చం రఘువరన్ లాగానే!

Raghuvaran younger brother Ramvaran interview
 
రఘువరన్... దక్షిణాది సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. విలన్ అంటే కండలు తిరిగిన శరీరంతో ఉండాల్సిన అవసరం లేదని నిరూపించిన నటుడు రఘువరన్. అయితే ఆయన 49 ఏళ్ల చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ఓ విషాదం. 

ఇక అసలు విషయం ఏమిటంటే.. ఇప్పటిదాకా రఘువరన్ ఫ్యామిలీ అంటే భార్య రోహిణి, కుమారుడు సాయి రిషివరన్ గురించే అందరికీ తెలుసు. కానీ, ఓ టీవీ చానల్ వారు తాజాగా రఘువరన్ తల్లి, సోదరుడి గురించి తెలుసుకుని వారిని ఇంటర్వ్యూ చేశారు. 

కాగా, బెంగళూరులోని వారి ఇంటికి వెళ్లిన ఆ చానల్ యాంకర్... రఘువరన్ సోదరుడు రామ్ వరన్ ను చూసి ఆశ్చర్యపోయాడు. అచ్చం రఘువరన్ లాగానే రామ్ వరన్ కూడా స్టయిలిష్ గా ఉండడమే అందుకు కారణం. రామ్ ను చూస్తే... ఫేస్ ఫీచర్స్ నుంచి హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్ అన్నింటా రఘువరన్ ను చూసినట్టే అనిపిస్తుంది అనడం అతిశయోక్తి కాదు. 

ఇక, రామ్ వరన్ తన సోదరుడు రఘువరన్ గురించి మాట్లాడుతూ, తన అన్న మొదట్లో ఇళయరాజా గ్రూప్ లో గిటారిస్టుగా పని చేశాడని, ఆ తర్వాత సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తాము బెంగళూరులో నివసిస్తున్నామని.. కన్నడ, తమిళ చిత్రాల్లో నటిస్తున్నానని... అవకాశం వస్తే తెలుగులో కూడా నటిస్తానని రామ్ వరన్ చెప్పారు.
Raghuvaran
Ramvaran
Brother
Actor
Bengaluru

More Telugu News