Telangana: టీటీడీకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అందిస్తాం: తెలంగాణ విజయ డెయిరీ

TG Vijaya Dairy ready to give pure cow milk to TTD
  • టీటీడీ ఈవోకు లేఖ రాసిన తెలంగాణ అధికారి సబ్యసాచి ఘోష్
  • నైవేద్యాల కోసం స్వచ్ఛమైన ఉత్పత్తుల సరఫరాకు సిద్ధమని వెల్లడి
  • పాలు, పెరుగు ఉత్పత్తుల రంగంలో విజయ డెయిరీ ప్రసిద్ధి గాంచిందని వెల్లడి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కోసం తాము స్వచ్ఛమైన ఆవు పాలు, నెయ్యి తదితర పాల ఉత్పత్తులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ విజయ డెయిరీ వెల్లడించింది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావుకు తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్ లేఖ రాశారు.

శ్రీవారికి టీటీడీ సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన పాలు, నెయ్యి, ఇతర పదార్థాలను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పాలు, పెరుగు ఉత్పత్తుల రంగంలో తెలంగాణ విజయ డెయిరీ సంస్థ ప్రసిద్ధి చెందిందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన, విలువైన ఉత్పత్తులను సరఫరా చేసిన చరిత్ర విజయ డెయిరీ కలిగి ఉందన్నారు.
Telangana
Vijaya Dairy
TTD
Tirumala

More Telugu News