Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ రిక్వెస్ట్ పై వెట్రిమారన్ స్పందన

Vetrimaran response on Junior NTR
  • వెట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తానన్న జూనియర్ ఎన్టీఆర్
  • తారక్ కు ఇప్పటికే ఒక స్క్రిప్ట్ వినిపించానన్న వెట్రిమారన్
  • ప్రస్తుత సినిమాలు పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ చిత్రంపై దృష్టి పెడతానని వెల్లడి
తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో తారక్ మాట్లాడుతూ వెట్రిమారన్ గురించి మాట్లాడారు. తమిళంలో స్ట్రెయిట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు? ఏ దర్శకుడితో చేయబోతున్నారు? అని తారక్ ను వ్యాఖ్యాత ప్రశ్నించగా ఆయన వెట్రిమారన్ పేరు చెప్పారు. 

వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే ఎన్టీఆర్ తో వెట్రిమారన్ సినిమా చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. మరోవైపు ఎన్టీఆర్ కామెంట్స్ పై వెట్రిమారన్ స్పందించారు. తారక్ కు ఒక స్క్రిప్ట్ ఇప్పటికే వినిపించానని... ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఎన్టీఆర్ తో చేసే సినిమాపై దృష్టి పెడతానని చెప్పారు. మరోవైపు లాక్ డౌన్ తర్వాత ఎన్టీఆర్ కు ఒక స్క్రిప్ట్ చెప్పానని గతంలో కూడా వెట్రిమారన్ చెప్పారు.
Junior NTR
Vetrimaran
Tollywood
Kollu Ravindra

More Telugu News